![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2 '(karthika Deepam2 ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -697 లో..... సూరజ్ ని కార్తీక్ ఇంటికి తీసుకొని వస్తాడు. నువ్వు మా వాళ్ళ దెబ్బలు తిన్నావు.. గాయాలు అయ్యాయి.. అందుకే నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండమని శివన్నారాయణ అంటాడు. దాంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. వద్దు సర్ అని సూరజ్ అంటాడు. ఆ తర్వాత నీకు మంచి ప్లేస్ దొరికే వరకు ఇక్కడే ఉండు.. ఆ తర్వాత వెళ్ళిపోమని శివన్నారాయణ, కార్తీక్ బలవంతపెట్టగానే సూరజ్ సరే అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం గదిలో మాట్లాడుకుంటారు.
ఏంటే వాడిని కొట్టించావ్.. చంపాలని ట్రై చేసావ్.. ఇప్పుడు వాడు నిన్ను వదిలిపెడతాడా అని పారిజాతం అంటుంటే.. ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఇంట్లో నుంచి బయటకు పంపించాలని జ్యోత్స్న అంటుంది.ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే.. అవును సూరజ్ ని పిలిచావా అని దశరథ్ తో శివన్నారాయణ అంటాడు. ఎందుకు తాత ఇంట్లో వాళ్ల ప్రైవసీ గురించి కూడా ఆలోచించాలి కదా అని జ్యోత్స్న అంటుంది. సరే మనం తిన్నాక పిలుద్దామని శివన్నారాయణ అంటాడు. ఇక్కడికి ఎందుకు అక్కడికి భోజనం ఇద్దామని పారిజాతం అంటుంది. సరే నేను భోజనం తీసుకొని వెళ్లి ఇస్తానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత కాంచన వాళ్ళు.. వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు. మన ఇంట్లో తిన్న తృప్తి ఎక్కడ ఉండదిరా అని కాంచన అనగానే అది నీ పుట్టిల్లే కదా అని కార్తీక్ అంటాడు. దీప ఏంటో ఆ ఇంట్లో నుంచి రావడానికి తెగ ఫిల్ అవుతుంది. అదేదో తన పుట్టిల్లు అయినట్లు.. మా వదిన తల్లి అయినట్లు అని కాంచన అనగానే దీప అలా అనుకుంటే తప్పేంటి అన్నట్లుగా కార్తీక్ అంటాడు.
మరొకవైపు సూరజ్ కి జ్యోత్స్న భోజనం తీసుకొని వెళ్తుంది. సూరజ్ డ్యాన్స్ చేస్తూ వంట చేస్తుంటాడు. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా నాటకమా అని జ్యోత్స్న అంటుంది. తెలిసిపోయిందా.. అవునే అని సూరజ్ అంటాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నావని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు నన్ను దెబ్బ కొట్టావ్ అందుకే.. నన్ను గెలికితే అసలు ఊరుకోను.. ఇదంతా నా ప్లాన్.. నువ్వు నా కోసం రౌడీలని పంపావు.. అదే రౌడీలకి నేను డబ్బులు ఇచ్చాను.. నేను చెప్పింది చేశారని సూరజ్ అంటుంటే ఇప్పుడే ఇదంతా నాటకమని ఇంట్లో వాళ్ళకి చెప్తాను అని జ్యోత్స్న అంటాడు. అప్పుడే తనకి ఓ వీడియో చూపిస్తాడు సూరజ్. అందులో ఏం ఉంటుందంటే.. జ్యోత్స్న పెట్టిన రౌడీ సూరజ్ ని చంపమని డబ్బు ఇచ్చింది జ్యోత్స్న మేడమ్ అని ఆ రౌడీ చెప్పే వీడియోని జ్యోత్స్నకి సూరజ్ చూపిస్తాడు. ఇప్పుడు ఈ వీడియో మీ ఇంట్లో చూపిస్తానని సూరజ్ బ్లాక్ మెయిల్ చెయ్యడంతో జ్యోత్స్నలో టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |